ఇంగ్లండ్ తో టీ20: పంత్ రాక.. రాహుల్ కు చెక్.. ఎవరు ఇన్..? ఎవరు ఔట్?

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ విజయంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. గత ఆస్ట్రేలియా సిరీస్ గెలవడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో పంత్ ఫామ్ దృష్ట్యా ఇంగ్లండ్ తో టీ20 జట్టులో ఖచ్చితంగా చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే అతడు టెస్టులనే వన్డేలు, టీ20లాగా ఆడి గెలిపించాడు. దీంతో పంత్ రాకతో ఎవరికి చెక్ పడుతుందనేది ఇప్పుడు టీమిండియా యాజమాన్యానికి సంకటంగా మారింది. ఇంగ్లండ్ తో 5 టీట్వంటీల ముందు […]

Written By: NARESH, Updated On : March 8, 2021 9:48 pm
Follow us on

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ విజయంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. గత ఆస్ట్రేలియా సిరీస్ గెలవడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో పంత్ ఫామ్ దృష్ట్యా ఇంగ్లండ్ తో టీ20 జట్టులో ఖచ్చితంగా చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే అతడు టెస్టులనే వన్డేలు, టీ20లాగా ఆడి గెలిపించాడు. దీంతో పంత్ రాకతో ఎవరికి చెక్ పడుతుందనేది ఇప్పుడు టీమిండియా యాజమాన్యానికి సంకటంగా మారింది.

ఇంగ్లండ్ తో 5 టీట్వంటీల ముందు టీమిండియా యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. తుది జట్టు ఎంపిక కష్టంగా మారింది. ఒక్కో స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు.

మొత్తం 19మంది టీంలో ఎవరిని తుదిజట్టులోకి తీసుకోవాలన్నది అంతుబట్టడం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేస్తారా? అన్నది చూడాలి.

పంత్ రాకతో ఇప్పుడు ఇన్నాళ్లు వన్డేలు, టీట్వంటీల్లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక పంత్, హార్ధిక్ పాండ్యా ఐదు ఆరు స్థానాల్లో ఆడితే వన్ డౌన్ లో కోహ్లీ ఖాయం.. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉంటారు. మధ్యలో 4వ ప్లేసు కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ పోటీపడుతున్నారు. సూర్య కోసం శ్రేయస్ ను పక్కనపెట్టొచ్చు. అతడికి అవకాశాలు ఇవ్వొచ్చు. ఇక ముంబై బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ సైతం అవకాశం కోసం చూస్తున్నాడు. ఇక రాహుల్ తెవాటియా కూడా పోటీలో ఉన్నాడు.

ఇక బౌలింగ్ లోనూ భువనేశ్వర్ కుమార్ రాకతో దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ లకు ఎసరు వచ్చింది. ఇక స్పిన్నర్లలో యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, వాష్టింగన్ సుందర్ ల మద్య పోటీ ఉంది. యార్కర్లు సంధించగల నటరాజన్ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది.