https://oktelugu.com/

సీఎం కేసీఆర్ కొత్త పీఆర్వోగా ఈ సీనియర్ జర్నలిస్ట్?

సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరు. ఆయన తీసుకునే చర్యలు మూడో కంటికి కూడా కనిపించవు. సడెన్ గా నిర్ణయం తీసుకున్నాక అందరూ నోరెళ్ల బెడుతారు. ఇటీవల సీఎంవో ఉన్నతస్థాయి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) విజయ కుమార్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొలగించిన వారం తరువాత ఆ ప్లేసులో ఎవరిని నియమిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆశ్చర్యకరంగా విజయ్ కుమార్ స్థానంలో తన ముఖ్య ప్రజా సంబంధాల […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2021 / 10:27 PM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరు. ఆయన తీసుకునే చర్యలు మూడో కంటికి కూడా కనిపించవు. సడెన్ గా నిర్ణయం తీసుకున్నాక అందరూ నోరెళ్ల బెడుతారు. ఇటీవల సీఎంవో ఉన్నతస్థాయి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) విజయ కుమార్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొలగించిన వారం తరువాత ఆ ప్లేసులో ఎవరిని నియమిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆశ్చర్యకరంగా విజయ్ కుమార్ స్థానంలో తన ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(పీఆర్వో)గా జ్వాలా నరసింహారావును నియమించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    అధికార వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం జ్వాలాను పిలిచి తన మీడియా ప్రతినిధిగా ఉండాలని కోరినట్లు సమాచారం. దీన్ని బట్టి ఆయన ఎంపిక ఖాయం అయ్యిందన్న ప్రచారం సాగుతోంది.

    విజయ్ కుమార్ తరహాలో జ్వాలాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ జ్వాలా గత సీనియారిటీని గుర్తించి కేసీఆర్ ఈ నియామకం చేసినట్టు తెలుస్తోంది. “జ్వాలా గతంలో వివిధ ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాడు. చాలా అనుభవాన్ని కలిగి ఉన్నారు. కానీ అందరిలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందలేకపోయాడని.. అయినా ఈ పాత జర్నలిస్టు వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. .

    చాలావరకు ఇలాంటి ఉద్యోగాలు చురుకైన జర్నలిస్టులు, యువ కత్తిలాంటి జర్నలిస్టులను తీసుకుంటారు. జూనియర్ పీఆర్‌లుగా నియమిస్తారు. కానీ జ్వాలా వార్తాపత్రికలలో వ్యాసాలు రాయడం తప్ప పెద్దగా పని చేయలేదని వర్గాలు తెలిపాయి.

    సీఎంఓ మొత్తం మీడియా మేనేజ్‌మెంట్ విభాగాన్ని సరిదిద్దాలని.. సీఎం కేసీఆర్ ప్రతిష్టను పెంచడంలో మరింత సమర్థవంతంగా పనిచేసే కొత్త వ్యక్తులను తీసుకురావాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కు దగ్గరగా ఉన్న టీఆర్ఎస్ అనుకూల సీనియర్ జర్నలిస్టులను త్వరలో పబ్లిసిటీ విభాగంలోకి తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.