https://oktelugu.com/

ఏడేళ్ల కేసీఆర్ పాలన.. ఒక్క డీఎస్సీ లేదా?

తెలంగాణ రాష్ట్ర సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్ ప్రధానంగా అధికారంలోకి రావడానికి ఉపయోగించిన అస్త్రాలు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఇందులో మొదటి రెండింటిని నెరవేర్చారు. నీళ్ల కోసం కాళేశ్వరం సహా ప్రాజెక్టులు కట్టేశారు. నిధులు బాగానే పెంచారు. తెలంగాణను సంపన్న రాష్ట్రం చేశారు. కానీ నియామకాల విషయంలోనే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా కూడా ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పైగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని రేషనలైజ్ చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2021 / 08:40 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్ ప్రధానంగా అధికారంలోకి రావడానికి ఉపయోగించిన అస్త్రాలు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఇందులో మొదటి రెండింటిని నెరవేర్చారు. నీళ్ల కోసం కాళేశ్వరం సహా ప్రాజెక్టులు కట్టేశారు. నిధులు బాగానే పెంచారు. తెలంగాణను సంపన్న రాష్ట్రం చేశారు.

    కానీ నియామకాల విషయంలోనే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా కూడా ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

    పైగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని రేషనలైజ్ చేసి ఉన్న ఉపాధ్యాయులను తగ్గించేసి అసలు ఉపాధ్యాయ పోస్టులే లేకుండా చేసిన ఘనత కేసీఆర్ ది అని నిరుద్యోగులు వాపోతున్నారు. నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఇప్పటి దాకా ఒక్క డీఎస్సీ కానీ, కనీసం టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు.

    టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి వైదొలగి ఏడాది కావస్తున్నా ఆ పోస్టు భర్తీ చేయడం లేదు. ఉద్యోగ ప్రకటనలను గాడినపెట్టడం లేదు. యథా రాజా తజా ప్రజా అన్నట్టుగా ప్రాధాన్యత రంగాలైన రైతులు, వ్యవసాయం, పరిశ్రమలను పట్టించుకొని నిరుద్యోగుల నోళ్లలో మట్టి కొడుతున్నారన్న ఆవేదన ఆ వర్గంలో నెలకొంది.

    తాజాగా పీసీసీ చీఫ్ ుత్తమ్ సైతం ఇదే లేవెనెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉపాధ్యాయ సంఘాలను టీఆర్ఎస్ మంత్రులు బెదిరిస్తున్నారని.. వివిధ రంగాల్లోని వారంతా గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఆలోచించి మీ ఆత్మగౌరవంతో టీఆర్ఎస్ ను ఓడించాలని ఉత్తమ్ పిలుపునిచ్చాడు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో కేసీఆర్ ను అడగాలని కోరాడు. చూస్తుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గులాబీ దండుకు నిరుద్యోగులు షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.