
మరో వారం రోజుల్లో బిహార్ ఎన్నికలు జరుగబోతున్నాయి. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటికే అటు పార్టీలు.. ఇటు ఎన్నికల సంఘం సిద్ధమయ్యాయి. ఇప్పటికే గెలుపుపై ఆయా పార్టీలు భరోసాతో ఉన్నాయి. ఎవరి గెలుపును వారు అంచనాలు వేస్తూనే ఉన్నారు. తదుపరి ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేయాలని కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Also Read: ఇస్లాం ప్రపంచం సెక్యులరిజంతో ఎందుకు ఘర్షణ పడుతుంది?
అయితే.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా సర్వేలు కామన్. అలాగే.. బిహార్‌లోనూ జరుగబోతున్న ఎలక్షన్లపై లోక్‌నీతి సీఎస్‌డీఎస్ సర్వే చేసింది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో చెప్పింది. జేడీయూ–-బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 243 స్థానాలున్న బిహార్‌లో ఆర్జేడీ–-కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది.
రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారథ్యం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం దక్కవచ్చని.. ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనాకు వచ్చంది. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
Also Read: భాగ్యనగర రోదన.. ఆగని వాన.. అనుక్షణం భయంభయం
మరోవైపు బిహార్ ఎన్నికలను ప్రతీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి ఎన్నికలే దేశభవిష్యత్తును నిర్ణయిస్తాయనేది చాలా పార్టీలో ఉన్న విశ్వాసం. అందుకే అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్, మరోవైపు ప్రాంతీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ సర్వేతో బిహార్‌లో బీజేపీ కూటమినే పాగా వేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది.