https://oktelugu.com/

రైతుల ఆందోళనలపై ‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు..!

కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త బిల్లులు తీసుకొచ్చింది. వీటిని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా రైతులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెల్సిందే..! Also Read: ముందుగా పోలీసు శాఖలోనే భర్తీ ఈక్రమంలోనే రైతులకు.. కేంద్రానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఈక్రమంలోనే రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల మేలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 3:15 pm
    Follow us on

    Supreme Court

    కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త బిల్లులు తీసుకొచ్చింది. వీటిని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా రైతులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెల్సిందే..!

    Also Read: ముందుగా పోలీసు శాఖలోనే భర్తీ

    ఈక్రమంలోనే రైతులకు.. కేంద్రానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఈక్రమంలోనే రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది.

    కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తుండగా.. రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతోంది.

    ఇదిలా రైతులు ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. వారికి అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    Also Read: అమ్మవారికే శఠగోపం పెట్టారు..

    రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ వారు తమ ఆందోళనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని స్పష్టం చేసింది.

    రైతులు రోడ్లు.. నగరాలను దిగ్బంధించొద్దని సుప్రీంకోర్టు ఆందోళనకారులకు సూచించింది. నిరసన కార్యక్రమాలు విధ్వంసంగా మారకుండా రైతులు చూసుకోవాలని సూచించింది. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటే మార్గమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.

    ఇదిలా ఉంటే కేంద్రం డిసెంబర్ 19లోపు కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతులు సంఘాలు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ఈ బిల్లుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్