టెస్టుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రతిసారీ టీమిండియాదే విజయం. చాలాకాలంగా ఆ సెంటిమెంట్ సక్సెస్ అవుతూ కనిపిస్తోంది. తాజాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈసారి పింక్‌బాల్ టెస్టులోనూ గెలిచి తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: అదిరిపోయే ట్వీస్ట్.. యువీ రిటైర్మెంట్ వాపస్..!
మొత్తం 21 సందర్భాల్లో టాస్ గెలిచిన కోహ్లీ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. విదేశాల్లోనూ పది సార్లు టాస్ గెలువగా.. 8 సార్లు విజయం సాధించారు. దీంతో ఈ సెంటిమెంట్ బాగా ప్రచారంలోకి వెళ్లింది. మరోవైపు ప్రస్తుత సరీస్‌లో రికార్డుపై కన్నేశాడు కోహ్లీ. ఇప్పటికే రెండు టెస్టులు గెలుపొందిన అతడు.. ఇప్పుడిక మరొక మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు గెలిచిన ఏకైక ఆసియా సారథిగా నిలుస్తాడు.
Also Read: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీం ఇదే
ఇంతకుముందు టీమిండియా మాజీ సారథి బిషన్ సింగ్ బేడీ 1977–78 సీజన్‌లో భారత్‌కు కంగారూ గడ్డపై రెండు విజయాలు అందించాడు. అలాగే పాకిస్థాన్ మాజీ సారథి ముస్తాక్ మహ్మద్ 1977, 1979లో ఒక్కో టెస్టు గెలుపొందాడు. ఆ తర్వాత కోహ్లీ సేన 2018–19 సీజన్‌లో రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.