ముందుగా పోలీసు శాఖలోనే భర్తీ

ఇన్నాళ్లు నియామకాలను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌.. రెండు ఎన్నికల్లో తగిలిన దెబ్బతో ఒక్కసారిగా కళ్లు తెరిచింది. ఏకంగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముందుగా పోలీసు శాఖ, విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో అధికారులు సైతం చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: టీపీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నది వీరే ఈసారి రిక్రూట్‌మెంట్‌ను మరింత ఈజీ చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 2:37 pm
Follow us on


ఇన్నాళ్లు నియామకాలను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌.. రెండు ఎన్నికల్లో తగిలిన దెబ్బతో ఒక్కసారిగా కళ్లు తెరిచింది. ఏకంగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముందుగా పోలీసు శాఖ, విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో అధికారులు సైతం చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: టీపీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నది వీరే

ఈసారి రిక్రూట్‌మెంట్‌ను మరింత ఈజీ చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసు నియామక మండలి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. 2018 మేలో నియామక మండలి దాదాపు 16 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ భర్తీ చేసేందుకు సిద్ధపడింది. అందుకే.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధపడింది.

మిగితా ఉద్యోగాల భర్తీ కంటే పోలీసు శాఖలో భర్తీ భిన్నంగా ఉంటుంది. సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌తోపాటు ఫిజికల్‌ టెస్టులు ఉంటాయి. అన్నింటిలోనూ పాసైతే ఏడాదిపాటు ట్రైనింగ్‌ ఉంటుంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా నియామక ప్రకటన జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన 2021 జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత పొందిన వారు 2022ఏప్రిల్‌ తర్వాత ఆమోదం వచ్చాక ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశం ఉంటుంది.

Also Read: గ్రేటర్లో కొత్త.. పాత కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు..!

గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక.. తమ పేరు తప్పుగా నమోదైందని, కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకే ఈ సారి ప్రత్యేక యాప్‌ రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఈ యాప్‌ ద్వారా ఏవైనా తప్పులు దొర్లినా సరిచేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్