టాలీవుడ్ అగ్రహీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్పట్లో కొన్న కారవాన్ వార్తల్లో నిలిచింది. దాదాపు 5 కోట్లు పెట్టి ఆయన కొన్న ఆ కారవాన్ లోని సౌకర్యాలు, అత్యాధునిక విశేషాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ కే ఖరీదైన కారవాన్ ఉండేది.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బన్నీ బాటలో నడిచాడట.. ఖరీదైన కారవాన్ ను మహేష్ బాబు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారవాన్ ఫొటోలు తాజాగా బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. మహేష్ అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు.
అత్యాధునిక హంగులతో ఈ కారవాన్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం ముంబైకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ వర్క్ చేస్తోందని టాక్.
దీనికోసం మహేష్ కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. బన్నీ కారవాన్ కు మించి ఖర్చు అయ్యిందంటున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకు లేని కారవాన్ మహేష్ కు ుందని ఫొటోలు షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.