తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర ఉన్న విద్యా మండలి టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ నునేడు విడుదల చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్ష జరగనుంది. జులై నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. కరోనా విజృంభణ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలో ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించి 100 శాతం సిలబస్, సెకండియర్ కు సంబంధించి 70 శాతం సిలబస్ ఉంటుంది. ఎంసెట్ పరీక్ష ప్రతిరోజు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 6, 2021 8:15 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ఉన్న విద్యా మండలి టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ నునేడు విడుదల చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్ష జరగనుంది. జులై నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. కరోనా విజృంభణ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలో ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించి 100 శాతం సిలబస్, సెకండియర్ కు సంబంధించి 70 శాతం సిలబస్ ఉంటుంది.

ఎంసెట్ పరీక్ష ప్రతిరోజు రెండు దశలలో ఆన్ లైన్ లో జరగనుంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి నెల 20వ తేదీ నుంచి మే నెల 18వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జూన్ నెల 28వ తేదీలోపు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 5,6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

జూలై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మే నెలలో ఎంసెట్ పరీక్షలు జరిగేవి. ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభణ వల్ల ఆలస్యంగా పరీక్షలు జరుగుతున్నాయి. జేఎన్టీయూ హెచ్ రెక్టార్ గోవర్ధన్ ఇంటర్ పరీక్షలకు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

మే 19 నుంచి మే 27 వరకు దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు కాగా మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. సిలబస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ 55 శాతం, ఇంటర్ సెకండియర్ వెయిటేజీ 45 శాతం ఉంటుంది