https://oktelugu.com/

రావాల్సినంత రాలేదు: నాగబాబు కామెంట్స్ వైరల్

మెగా బ్రదర్‌‌ నాగబాబు.. ఎప్పుడెలా మాట్లాడుతారో ఏం అర్థం కాదు. ఎప్పుడు హాస్యాన్ని పండిస్తారో.. ఎప్పుడు వెటకారంగా ఉంటారో కూడా చెప్పలేం. ఈ విషయాన్ని స్వయానా ఆయన కుతురు నిహారిక సైతం చాలా సందర్భాల్లోనూ వెల్లడించింది. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరితే నాగబాబు చేసే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుందని, అందరినీ నవ్విస్తుంటారని చెబుతుంటారు. ఆ విషయం సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్‌ అందరికీ తెలిసిందే. ఆయన ఎలా కౌంటర్లు ఇస్తుంటారు.. పంచ్‌లు ఎలా వేస్తారో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 22, 2021 / 11:20 AM IST
    Follow us on


    మెగా బ్రదర్‌‌ నాగబాబు.. ఎప్పుడెలా మాట్లాడుతారో ఏం అర్థం కాదు. ఎప్పుడు హాస్యాన్ని పండిస్తారో.. ఎప్పుడు వెటకారంగా ఉంటారో కూడా చెప్పలేం. ఈ విషయాన్ని స్వయానా ఆయన కుతురు నిహారిక సైతం చాలా సందర్భాల్లోనూ వెల్లడించింది. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరితే నాగబాబు చేసే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుందని, అందరినీ నవ్విస్తుంటారని చెబుతుంటారు. ఆ విషయం సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్‌ అందరికీ తెలిసిందే. ఆయన ఎలా కౌంటర్లు ఇస్తుంటారు.. పంచ్‌లు ఎలా వేస్తారో ఎన్నోసార్లు చూసి ఉంటారు.

    Also Read: పవన్ కళ్యాణ్ సినిమాతో విజయ్ దేవరకొండ బిజినెస్ స్ట్రాట్

    మెగా బ్రదర్ కామెడీ టైమింగ్, కౌంటర్లు వేసే తీరు, ఆయన పెట్టే పోస్ట్‌లు ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో నాగబాబు పెట్టిన పోస్ట్‌లు సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. బాలకృష్ణ, గాడ్సే, గాంధీ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. అవి చిలికి చిలికి గాలివానలా మారే సరికి నాగబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నాగబాబు తాజాగా తన ఇన్ స్టాగ్రాంలో దుమ్ములేపారు. ఆయన తన ఫాలోవర్లు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు చెప్పారు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగితే.. వారికి అదే శైలిలో సమాధానాలు ఇచ్చారు. వాటిని చూసి మీమర్స్ సైతం ఆశ్చర్యపోయారు. నాగబాబు ఇచ్చిన ఆన్సర్స్‌పై మీమర్స్ కూడా వెరైటీ మీమ్స్ వేసేశారు.

    Also Read: వైరల్ పిక్: ఆర్ఆర్ఆర్ ‘సీత’ ఇలా షాకిచ్చింది

    అయితే.. తాజాగా మీమర్స్‌తో నాగబాబు ముచ్చటించారు. మీమర్స్‌కు సరైన గుర్తింపు రావడం లేదని, చాలా మందికి వారి విలువ తెలియదని నాగబాబు అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి వీరిపై అవగాహన లేదని అన్నారు. కానీ.. మీమర్స్ ఎంతో శక్తివంతమైన వాళ్లని, యూత్‌కు ఇదొక ఇన్ కం జనరేట్ అయ్యే సోర్స్ అవ్వాలని కోరారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్