40 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లు రాత్రి నిద్రపోయిన సమయంలో ఎక్కువగా గురక పెడుతుంటారు. ఆ గురక వల్ల పక్కన ఉన్నవాళ్లు నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టదు. వినటానికి గురక సమస్య చిన్నదిగా అనిపించినా ఆ సమస్య వల్ల గురక పెడుతున్న వాళ్ల పక్కన పడుకునే వాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ గురక వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఒబెసిటీ ఉన్నవాళ్లు ఎక్కువగా గురక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. కండ్రాల మధ్యలో శ్వాసకు ఏదైనా ఆటంకం కలిగితే అప్పుడు గురక వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఈ గురక సమస్యకు పరిష్కారం లేదా..? అంటే ఉందని కొన్ని మందులు గురక సమస్యకు పరిష్కారంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. బ్రిగామ్, బోస్టన్ లోని మహిళల హాస్పిటల్ శాస్త్రవేత్తలు గురక పెడుతున్న 20 మందిపై పరిశోధనలు చేశారు.
ఆ పరిశోధనల్లో గురక సమస్యతో బాధ పడుతున్న వారికి రెండు రాకాల మందులను ఇవ్వగా వారిలో గురక సమస్య తగ్గింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సమస్యను తగ్గించే ఆటోమోక్సిటైన్, యూరినరీ ఇన్‌కాంటినెన్స్ సమస్యతో బాధ పడే వాళ్లు వాడే ఆక్సిబ్యూటీనిన్ గురక సమస్యను తగ్గిస్తున్నాయని తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి ఈ మందులు వాడుకలో ఉండటంతో వీటి వల్ల సమస్య తగ్గుముఖం పట్టిందని సమాచారం.
కండరాలను కంట్రోల్ చేయడంలో సహాయపడే ఈ మందులు బ్లాడర్ ఫ్రీ చేసి శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అయితే రెండు మందులకు బదులుగా ఏడీ 109 పేరుతో అమెరికా కంపెనీ ఒక కొత్త మందును తయారు చేస్తోంది. ఈ మందు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే గురక సమస్యకు చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు.