https://oktelugu.com/

ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం: జనసేన

ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటి అయ్యారు. Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు? రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే ఏపీలో నిలిచిపోయిన ఎన్నికల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 06:16 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటి అయ్యారు.

    Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?

    రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే ఏపీలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్లు నిమ్మగడ్డ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించినట్టు సమాచారం. ఈ భేటికి అధికార వైసీపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీడీపీ పార్టీ కోరింది.

    ఏపీలో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు జనసేన కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను స్వయంగా గాని లేదా రాతపూర్వకంగా గానీ, మెయిల్ ద్వారా గానీ తెలియచేయటానికి ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. అందువల్ల జనసేన పార్టీ అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా తెలియజేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి ఈ-మెయిల్ ద్వారా జనసేన అభిప్రాయాన్ని తెలియచేశానని బి.మహేందర్ రెడ్డి తెలిపారు..

    స్థానిక సంస్థల సాధికారత, బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని బి.మహేందర్ రెడ్డి మెయిల్ లో ఎస్ఈసీకి వివరించారు. రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగ విలువలను గౌరవిస్తామన్నారు. ఆ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటామని జనసేన తన అభిప్రాయన్ని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా- భారత ఎన్నికల కమిషన్ ఈ యేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని సూచించింది.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది.

    Also Read: సంచలనం: కేసు నుంచి తప్పించాలని కోర్టులో జగన్ పిటీషన్

    అదే విధంగా 2020 మార్చి నెలలో సాగిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు చేసిన అవకతవకలు, భారీ హింసపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి మరోమారు తీసుకువస్తున్నామని జనసేన తన లేఖలో  కోరింది.