https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో బుక్?

కర్ణాటక రాష్ట్రంలో డ్రగ్స్ కేసు అక్కడి సినీ, రాజకీయ వర్గాలను షేక్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. శాండిల్ వుడ్ తారలు రాగిణి ద్వివేది.. సంజనలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి అగ్రహారం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి నుంచి సీసీబీ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తాజాగా ఈ డ్రగ్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 / 10:14 AM IST
    Follow us on

    కర్ణాటక రాష్ట్రంలో డ్రగ్స్ కేసు అక్కడి సినీ, రాజకీయ వర్గాలను షేక్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. శాండిల్ వుడ్ తారలు రాగిణి ద్వివేది.. సంజనలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి అగ్రహారం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి నుంచి సీసీబీ పోలీసులు కీలక సమాచారం సేకరించారు.

    తాజాగా ఈ డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా మస్తాన్, విక్కీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. ముస్తాన్ ను విచారించగా టాలీవుడ్ సినీ నిర్మాత పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యారని పోలీసులు తెలిపారు.

    ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో పేరు కూడా బయటపడినట్లు సమాచారం. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ ఫేం తనీష్ కు ఈ మేరకు బెంగళూరు పోలీసులు నోటీసులు అందించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న హీరో తనీష్ 2017 జులైలో జరిగిన డ్రగ్స్ కేసులో కూడా హైదరాబాద్ సిట్ పోలీసుల ముందు హాజరవ్వడం విశేషం.

    టాలీవుడ్ హీరోతోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత తదితరులు ఉన్నట్టు పోలీసులు అధికారులు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కేసుపై తనీష్ ఇంతవరకు స్పందించలేదు. ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై పోలీసుల నుంచి వివరణ రావాల్సి ఉంది.