https://oktelugu.com/

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు. అయితే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంకుతో పాటు పలు ప్రముఖ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 14, 2021 / 04:30 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు. అయితే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇచ్చింది.

    ఈ బ్యాంకుతో పాటు పలు ప్రముఖ బ్యాంకులు సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు భారీ ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐఐటీ బాంబే నివేదిక ప్రకారం జీరో బ్యాలెన్స్ అకౌంట్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల నుంచి 4 లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఒక డెబిట్ ట్రాన్సాక్షన్ కు 17.7 రూపాయల చొప్పున ఎస్బీఐ ఛార్జీలను వసూలు చేసింది. పేదల జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి ఎస్బీఐ ఛార్జీలను వసూలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    నివేదిక ప్రకారం ఎస్బీఐ గడిచిన ఆరు సంవత్సరాలలో 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల నుంచి దాదాపు 300 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా భారీ మొత్తం సర్వీస్ ఛార్జీలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం బ్యాంకులు డిజిటల్ లావాదేవీలకు సైతం పరిమితి దాటిన తరువాత ఛార్జీలను వసూలు చేశాయి.

    కస్టమర్ల నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్ ఛార్జీలను వసూలు చేసే బ్యాంకుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరించాలని నెటిజన్లు కోరుతున్నారు.