దేశంలో కరోనా ధాటికి లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పట్లో కొత్త ఉద్యోగం కోసం వెతికినా మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు తక్కువ. మరోవైపు చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించకపోయినా వేతనాల్లో కోత విధించాయి. దీంతో ప్రజలు గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఇలాంటి తరుణంలో ఇబ్బందులు పడకుండా డబ్బులు సంపాదించాలంటే తక్కువ పెట్టుబడితో లాభాలిచ్చే బిజినెస్ చేయడం ఉత్తమం. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాలను ఇచ్చే బిజినెస్ లలో టిష్యూ పేపర్ బిజినెస్ కూడా ఒకటి. రోజురోజుకు దేశవ్యాప్తంగా టిష్యూపేపర్ల వాడకం పెరుగుతోంది. ఆఫీస్ లలో, షాపింగ్ మాల్స్ లో, థియేటర్లలో ఎక్కువగా టిష్యూ పేపర్లను వినియోగిస్తున్నారు.
Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?
ఎక్కువ మొత్తంలో లాభాలు ఇచ్చే ఈ బిజినెస్ కు దాదాపు 11 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం ఇన్వెస్ట్ చేయలేని వాళ్లు జాయింట్ గా లేదా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే లోన్ పొంది ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ చేయాలంటే లైసెస్న్ పొందడంతో పాటు పొల్యూషన్ సెంట్రల్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టీఫికెట్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: పేటీఎం యూజర్లకు శుభవార్త.. ఆ చార్జీల రద్దు..?
కేంద్ర ప్రభుత్వం రుణాలను ఇస్తున్న ముద్రా స్కీమ్ ద్వారా కూడా లోన్ తీసుకుని సులువుగా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఎవరైతే మెషీన్లను కొనుగోలు చేస్తారో వాళ్లు సంవత్సరానికి లక్షన్నర కేజీల నుంచి రెండు లక్షల కేజీల వరకు టిష్యూ పేపర్లను సులువుగా తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ ద్వారా ఏకంగా నెలకు లక్ష రూపాయల వరకు మిగిలే అవకాశాలు ఉంటాయి.