Site icon OkTelugu

మావోయిస్టు కొరియర్ల అరెస్టు

భధ్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులను తీసుకెళ్తుండగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో మావోయిస్టుల అలజడితో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిత్యం కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు. రాష్ట్ర డీజీపై కుమరం భీం జిల్లాతో పాటు భధ్రాద్రి జిల్లాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version