https://oktelugu.com/

మోడీ అహంకారం వద్దు.. సాగు చట్టాలు రద్దు చేయండి

రైతుల విషయంలో మోడీ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. గత 40 రోజులుగా చలిని, మంచును కూడా తట్టుకొని బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా సోనియాగాంధీ తాజాగా గళం విప్పారు. రైతులు ఇంత తీవ్రంగా ఉద్యమిస్తున్నా ప్రధానితో సహా కేంద్రమంత్రుల్లో ఎలాంటి కదలికా లేదని ఆక్షేపించారు. కనీసం రైతులకు ఓదార్పు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2021 / 08:49 PM IST
    Follow us on

    రైతుల విషయంలో మోడీ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. గత 40 రోజులుగా చలిని, మంచును కూడా తట్టుకొని బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా సోనియాగాంధీ తాజాగా గళం విప్పారు.

    రైతులు ఇంత తీవ్రంగా ఉద్యమిస్తున్నా ప్రధానితో సహా కేంద్రమంత్రుల్లో ఎలాంటి కదలికా లేదని ఆక్షేపించారు. కనీసం రైతులకు ఓదార్పు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను సోనియాగాంధీ విడుదల చేశారు.

    చలి, మంచును లెక్కచేయకుండా రైతులు చేస్తున్న పోరాటం చూస్తుంటే దేశ ప్రజలతోపాటు తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందని సోనియా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతుల ప్రయోజనాలను కాపాడడమే నిజమైన ప్రజాస్వామ్యమని.. రైతుల విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

    స్వాతంత్య్రం  వచ్చాక మొట్టమొదటిసారి ఇంత అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని తాను చూస్తున్నానని సోనియా గాంధీ విమర్శించారు. జాతికి అన్నం పెట్టే రైతులను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అహాన్ని వీడాలని.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి నిరసనలకు ముగింపు పలకాలని కోరారు. రైతులు, కార్మికులను కాపాడడమే అసలైన ప్రజాస్వామ్యమని.. మోడీ ప్రభుత్వం దీన్ని నేర్చుకోవాలని సోనియా కోరారు.