https://oktelugu.com/

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ బోర్డ్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం నుంచి మే రెండవ వారం వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2021 11:04 am
    Follow us on

    TS EAMCET Exam

    కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ బోర్డ్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం నుంచి మే రెండవ వారం వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

    ఇంటర్ పరీక్షలు ముగిసిన నెల రోజుల తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఏడాది జూన్ నెలలో ఎంసెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తుండగా ఇతర ప్రవేశ పరీక్షలు జూన్ నెలలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు కరోనా విజృంభణ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో వార్షిక పరీక్షల, ప్రవేశ పరీక్షల ఫీజు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read: విద్యార్థులకు అమెజాన్ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆన్ లైన్ క్లాసులు..?

    ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల, వార్షిక పరీక్షల రుసుములు రద్దయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా పరీక్షల రుసుములు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రైవేట్ కాలేజీలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో కనీసం ప్రవేశ పరీక్షల రుసుములనైనా మినహాయిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ప్రభుత్వ కాలేజీల అధ్యాపకుల నుంచి కూడా ఇవే తరహా విజ్ఞప్తులు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజ్ఞప్తుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరి కొంతమంది కనీసం ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజును మినహాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.