
కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏపీలో అల్లాడిపోతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ ఆకృత్యాలపై ఆయన ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల అక్రమాలపై ఎస్పీలకు సోము వీర్రాజు ఫోన్ చేస్తే స్పందించడం లేదట.. ఈ విషయాలన్నింటిని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చెప్పారట.. అయినా కూడా ఏపీ బీజేపీపై వైసీపీ దౌర్జన్యాలు ఆగడం లేదని సోము వీర్రాజు వాపోయారు.
Also Read: నో అపాయింట్‌మెంట్..: అఖిల ప్రియను దూరం పెట్టిన బాబు
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడమే పాపం అవుతోందని సోము వీర్రాజు మండిపడ్డారు. నామినేషన్లు వేసే వారిని దాచేస్తున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో 10 రకాలైన కేసులు పెట్టడానికి ఓ చిట్టా తయారు చేసి అధికారులకు పంపిణీ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్తలపై అన్యాయం ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని.. రౌడీషీట్ లు తెరుస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.మద్యం తయారు చేసేది ప్రభుత్వమని.. విక్రయించేది ప్రభుత్వమని.. అక్రమం మద్యం పేరుతో కేసులు మాత్రం బీజేపీ నేతలపై పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నిమ్మగడ్డ ప్రైవేట్ ‘యాప్’ కథేంటి?
దమ్ముంటే నిజమైన ఎన్నికలు జరపండని.. గెలిచే అవకాశం వైసీపీకి ఉంటే ఎందుకు ఇలాంటి పాట్లు పడుతున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు.
మొత్తంగా ఏపీలో వైసీపీ ధాటికి బీజేపీ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అదే వైసీపీపై నిమ్మగడ్డ సాయంతో టీడీపీ పైచేయి సాధిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్