ఏపీ సీఎం జగన్ ఆయువు పట్టుపై కొడుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జగన్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ఇరుకునపెడుతున్నాడు. జగన్ ను ఇరుకునపెట్టేలా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తుండడం వైసీపీ ప్రభుత్వాన్ని సైతం ఇరుకునపెడుతోంది.
ఇప్పుడు ఏపీలో సమస్యలపై కంటే.. విభజన హామీల గురించిన చర్చలు కంటే కూడా హిందుత్వ, మతం ఇష్యూలే పెద్దవి అవుతున్నాయి. ఏపీలో ఆలయాలపై దాడులు ఎంత కాకరేపుతున్నాయో అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఏపీ ఆలయాలపై దాడులు.. సీఎం జగన్ క్రిస్టియానిటీని.. తిరుపతిలో క్రైస్తవ ప్రచారంపై ఏపీ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్ సర్కార్ ను కార్నర్ చేసింది. తాజాగా ఏపీ డీజీపీని కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేసి సంచలన లేఖ రాయడం కలకలం రేపింది. ఆ వివాదంపై మంత్రి వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా అది సరిపోలేదు.
తాజాగా సోము వీర్రాజుకు మరో అస్త్రం దొరికింది. ఏపీలోని చర్చిల ఆస్తుల వివరాలు కావాలంటూ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు.
హిందుత్వాన్ని రాష్ట్రంలో అస్థిరపరుస్తూ క్రిస్టియానిటీని జగన్ సర్కార్ పెంచి పోషిస్తోందని.. మతం మార్చడానికే పాస్టర్లకు జీతాలు చెల్లిస్తున్నారంటూ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో సీఎం జగన్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. ఆయన సర్కార్ పాస్టర్లకు జీతాలు ఇచ్చి హిందూ ఆలయ పూజారులకు ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు సోము వీర్రాజు హైలెట్ చేస్తున్నారు. జగన్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. దీన్ని నుంచి సీఎం జగన్ ఎలా బయటపడుతాడనేది ఉత్కంఠగా మారింది.