https://oktelugu.com/

అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. వాటిపై భారీ డిస్కౌంట్లు పొందే ఛాన్స్..!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ ఆఫర్లను ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్ సంస్థ మరో రెండు రోజుల్లో సేల్ ను ప్రారంభించనుండగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో అమెజాన్ మరో సేల్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. జనవరి 20వ తేదీన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2021 / 07:50 PM IST
    Follow us on

    ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ ఆఫర్లను ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్ సంస్థ మరో రెండు రోజుల్లో సేల్ ను ప్రారంభించనుండగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో అమెజాన్ మరో సేల్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. జనవరి 20వ తేదీన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది.

    నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సేల్ జనవరి 23వ తేదీన ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఈ నెల 19వ తేదీ నుంచే సేల్ ఆఫర్లు అందుబాటులోకి రానుండటం గమనార్హం. అమెజాన్ వాషింగ్ మిషన్. టీవీ కొనుగోలుపై 60 శాతం వరకు డిస్కౌంట్ ను ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది.

    వాషింగ్ మెషీన్, టీవీ కొనుగోలుపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్ లభిస్తూ ఉండటం గమనార్హం. రెడ్ మీ 9ఏ ఫోన్ ధర 9,499 రూపాయలుగా ఉండగా డిస్కౌంట్ లో భాగంగా ఆ ఫోన్ 6,499 రూపాయలకే లభించనుంది. అమెజాన్ లో వన్ ప్లస్ 8టీ ఫోన్ ధర 40,499 రూపాయలుగా ఉంది. ఐఫోన్ 12 మినీపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఇయర్ బడ్స్ ధర 20,999 రూపాయలుగా ఉంది.

    మరోవైపు ఫ్లిప్ కార్ట్ సైతం బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సేల్ ను నిర్వహిస్తోంది. ఐఫోన్, ఇతర కంపెనీల ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీ,అప్లియన్స్ తక్కువ ధరకే ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్, అప్లియన్సెస్ పై 75 శాతం రాయితీ పొందే అవకాశం ఉంటుంది