తెలుగులో ఇంతవరకు పరాజయం ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. అన్నివర్గాల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడంలోను అందెవేసిన చేయి..
గత ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకొంది..
ఇలా రెండు చిత్రాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను శరవేగంగా తీస్తున్నారు. వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా ఆయన ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లారు. కరోనా నుంచి కోలుకున్న వరుణ్ తేజ్ తాజాగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్పీడ్ గా సినిమాలు తీసే అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ ని కూడా స్పీడ్ గా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ..
తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఫొటోను షేర్ చేశాడు. ‘ఫన్’కు సెలవులు ఉండవని అనిల్ అంటున్నాడు. వారాంతంలో కూడా షూటింగ్ చేస్తున్నామని ఆయన తన హీరో వరుణ్ తేజ్, కమెడియన్ సునీల్, నిర్మాత దిల్ రాజుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీన్ని బట్టి ‘ఎఫ్3’ మూవీని శరవేగంగా తీస్తూ అనిల్ ముందుకెళతున్నాడని అర్థం అవుతోంది.
Nonstop shoot. Day and night. Even on weekends. Because fun has no holidays ..😀🤗 #F3Movie @IAmVarunTej @SVC_official pic.twitter.com/nAuKXJTJbo
— Anil Ravipudi (@AnilRavipudi) January 17, 2021