ఎన్నో ఏళ్ల నాటి కళ.. కోట్ల మంది హిందువుల మనోవాంఛ అయోధ్యలో శ్రీరామ ఆలయం.. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ కల నెరవేరబోతోంది.
Also Read: దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం.. గురజాడ మాట గుర్తుచేసిన మోడీ
ఈ తరుణంలో హిందువులు పరమపవిత్రంగా భావించే శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో దేశంలోని ప్రజలంతా భాగస్వాములవుతున్నారు. విరాళాలు ఇస్తున్నారు. వ్యక్తులు, వ్యాపారులు, ఉద్యోగులు పాలుపంచుకుంటున్నారు.
శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర వారి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా జరుగుతున్న శ్రీరామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: పెళ్లిలో బోరున ఏడ్చేసిన పెళ్లికొడుకు.. కారణమేంటంటే..?
ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ కూడా ముందుకొచ్చింది. శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం నా వంతుగా విరాళం అందించేందుకు ముందుకొచ్చారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ మేరకు రూ.50వేల చెక్ ను ఆలయ నిర్మాణ దాతలకు సోము వీర్రాజు అందజేశారు. హిందూ బంధువులందరూ వారికి తోచినంత విరాళాలు అందించవలసిందిగా కోరారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్