https://oktelugu.com/

బట్టతల సమస్యతో బాధ పడుతున్నారా.. పరిష్కార మార్గాలివే..?

దేశంలోని పురుషుల్లో 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో చాలామంది బట్టతల సమస్యతో బాధ పడుతున్నారు. కొందరికి జన్యు సమస్యల వల్ల బట్టతల వస్తే మరి కొందరికి కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల బట్టతల సమస్య వేధిస్తుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైనా జుట్టు త్వరగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషులతో పాటు కొంతమంది మహిళలను కూడా బట్టతల సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి. Also Read: నోరు, నాలుకపై ఈ లక్షణాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2021 / 03:14 PM IST
    Follow us on

    దేశంలోని పురుషుల్లో 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో చాలామంది బట్టతల సమస్యతో బాధ పడుతున్నారు. కొందరికి జన్యు సమస్యల వల్ల బట్టతల వస్తే మరి కొందరికి కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల బట్టతల సమస్య వేధిస్తుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైనా జుట్టు త్వరగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషులతో పాటు కొంతమంది మహిళలను కూడా బట్టతల సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి.

    Also Read: నోరు, నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా.. కరోనా సోకినట్టే..?

    డిహైడ్రో టెస్టోస్టెరాన్ పురుషుల్లో బట్టతలకు కారణమవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడవుతోంది. ట్రైకోస్కోపీ లేదా డెర్మోస్కోపీ పరీక్ష ద్వారా బట్టల సమస్యను నిర్ధారించే అవకాశం ఉంటుంది. అయితే బట్టతల సమస్య ఉన్నంత మాత్రాన బాధ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మందులను వాడటం ద్వారా సులభంగానే బట్టతల సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్, మినాక్సిడిల్ లాంటి మందులు బట్టతలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి.

    Also Read: కాకరకాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    అయితే మందులు వాడినా ప్రయోజనం లేకపోతే కొన్ని థెరపీల ద్వారా చికిత్స తీసుకోవడం ద్వారా జుట్టు పెరుగుతుంది. స్టెమ్‌సెల్‌ థెరపీ, మీసోథెరపీ, రిచ్‌ ప్లాస్మా అండ్‌ డర్మారోలర్‌ లాంటి చికిత్సలు సైతం బట్టతల సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. లేజర్ కోంబింగ్, లైట్‌ థెరపీ లాంటి చికిత్సల ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని ఆయిల్స్ సహాయంతో కూడా బట్టతల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    అయితే ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోతే మాత్రం హెయిర్ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్న వాళ్లు బట్టతల రాకముందే వైద్యులను సంప్రదిస్తే జుట్టు రాలడానికి గల కారణం తెలుసుకోవడంతో పాటు మందులు వాడి బట్టతల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.