‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్: నాని మరో సర్ ప్రైజ్ గెటప్

ప్రయోగాలకు పెద్దపీట వేసే నేచురల్ స్టార్ నాని మరోసారి వినూత్నమైన కథా, కథనం,గెటప్ తో మనముందుకు వచ్చారు. నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ట్యాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కృతిశెట్టి, ఉప్పెన ‘కృతిశెట్టి’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోల్ కతా నేపథ్యంలో ఈ సినిమా […]

Written By: NARESH, Updated On : February 24, 2021 6:38 pm
Follow us on

ప్రయోగాలకు పెద్దపీట వేసే నేచురల్ స్టార్ నాని మరోసారి వినూత్నమైన కథా, కథనం,గెటప్ తో మనముందుకు వచ్చారు. నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ట్యాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా కృతిశెట్టి, ఉప్పెన ‘కృతిశెట్టి’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోల్ కతా నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందట.. హై ఓల్టేజ్ యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందట.. హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

హీరో నాని ఈ సినిమాలో బెంగాలీగా అందరినీ ఆశ్చర్యపరిచే గెటప్ లో కనిపిస్తాడట.. హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు ఓ రేంజ్ ఉంటుందని టాక్. పోస్టర్ లోనూ నాని షాకింగ్ లుక్ తాజాగా బయటపెట్టారు.

నాని ఒక అమ్మాయి వెనుకాల నుంచి కౌగిలించుకుంటే ఠీవీగా నిలబడ్డ లుక్ చూస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లవ్ స్టోరీ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

నాని ఇప్పటిదాకా చేసిన రోల్స్ కంటే భిన్నంగా వెరైటీ చాలెంజింగ్ రోల్ లో ఇందులో కనిపిస్తాడని టాక్. కోల్ కతాలో జరుగుతున్న ఈ షూటింగ్ లో ప్రస్తుతం ప్రధాన తారాగణం అయిన రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ తదితరులు నటిస్తున్నారట.. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.