బీజేపీకి ఇక జగన్ యే దిక్కా?

ఏపీ మున్సిపల్ ఎన్నికలతో బీజేపీకి జ్ఞానోదయమైందా? పార్ట్ టైం పాలిటిక్స్ చేసే జనసేనాని పవన్ కళ్యాణ్ తో వెళ్లడం శుద్ధ దండగ అని భావిస్తోంది. ఇక వయసు అయిపోయిన చంద్రబాబును నమ్మడం వృథా అని భావిస్తోందా? ఏపీతోపాటు దక్షిణాదిలో పట్టు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా జగన్ తో వెళ్లడమే శ్రేయస్కరం అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారా? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం చూశాక జగన్ ను మచ్చిక చేసుకోవడమే బెటర్ అన్న ఆలోచనకు ఢిల్లీ […]

Written By: NARESH, Updated On : March 15, 2021 9:59 am
Follow us on

ఏపీ మున్సిపల్ ఎన్నికలతో బీజేపీకి జ్ఞానోదయమైందా? పార్ట్ టైం పాలిటిక్స్ చేసే జనసేనాని పవన్ కళ్యాణ్ తో వెళ్లడం శుద్ధ దండగ అని భావిస్తోంది. ఇక వయసు అయిపోయిన చంద్రబాబును నమ్మడం వృథా అని భావిస్తోందా? ఏపీతోపాటు దక్షిణాదిలో పట్టు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా జగన్ తో వెళ్లడమే శ్రేయస్కరం అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారా? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం చూశాక జగన్ ను మచ్చిక చేసుకోవడమే బెటర్ అన్న ఆలోచనకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది.

దేశ రాజకీయాల్లో బీజేపీపై ప్రజల్లో పార్టీల్లో అసహనం పెరిగిపోతోంది. పెట్రోల్, నిత్యావసరాల పెంపు, కరోనా లాక్ డౌన్ సమయంలో నిధులు విదిల్చకపోవడం.. ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక నిర్ణయాలతో ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి దూరంగా జరిగాయి. పొత్తులు రద్దు చేసుకున్నాయి. ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాలని.. బలమైన శక్తులను అక్కున చేర్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఏపీలో బలంగా తయారవుతున్న జగన్ తో దోస్తీ కట్టాలని కమలనాథులు సీరియస్ గా ఆలోచిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే జగన్ ను ఎన్డీయేలోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావించారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం సహా పలు డిమాండ్లను జగన్ వారి ముందు ఉంచడంతో అవి నెరవేర్చలేక ఇన్నాళ్లు జగన్ ను దూరం పెట్టారు. ఇక జగన్ కేసుల ఉచ్చును కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జగన్ ప్రజాదరణ చూసి తప్పకుండా ఆయనను ఓన్ చేసుకోవడం తప్ప బీజేపీ పెద్దలకు మరో గతి లేకుండా పోతోంది. ఏపీలో స్థానిక సంస్థల్లో జగన్ ప్రభంజనం చూశాక పార్ట్ టైం పాలిటిక్స్ చేసే పవన్ కంటే జగన్ తోనే వెళితే బెటర్ అని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

ఇక జగన్ ఎన్డీఏలో చేరాలంటే ఖచ్చితంగా ఏపీకి కేంద్రం సాయం చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ లోటు సర్ధడం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవడం.. పోలవరం, ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు బీజేపీ ఒప్పుకుంటేనే జగన్ ఎన్టీఏలో చేరుతారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఈ పరిణామాలు సంభవించవచ్చని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి అసోం తప్ప మిగిలిన రాష్ట్రాల్లో గెలిచే చాన్స్ లేదు. ఆ ఫలితాల తర్వాత ఖచ్చితంగా జగన్, కేసీఆర్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ ఆహ్వానించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ లో చేరాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకు అంతో ఇంతో చేస్తేనే అది సాధ్యం. మరి బీజేపీ ఏం నిర్ణయిస్తుంది.. జగన్ ఎలా స్పందస్తారన్నది వేచిచూడాలి.