https://oktelugu.com/

భ‌ర్త రామ్ తో ఎంజాయ్ చేస్తున్న కొత్త పెళ్లి కూతురు సునీత‌!

‘‘న‌వ్వేవాళ్లూ న‌వ్వ‌నీ.. ఏడ్చే వాళ్లూ ఏడ్వ‌నీ.. తిట్టేవాళ్లూ తిట్ట‌నీ.. పొగిడేవాళ్లూ పొగ‌డ‌నీ.. డోన్ట్ కేర్’’ అంటూ ఓ ఫేమ‌స్ పాట ఉంది. ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పాట‌ను నిత్యం హ‌మ్ చేస్తోంది కొత్తపెళ్లి కూతురు సునీత‌. తన లైఫ్ కు అప్లై చేసుకొని, తన గాత్రాన్ని మిక్స్ చేసి ఇరగదీస్తోందని చెప్పొచ్చు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సింగర్ సునీత పిక్స్ చూస్తే.. మీరు కూడా ఇదే అంటారు. భ‌ర్త రామ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 15, 2021 / 10:14 AM IST
    Follow us on


    ‘‘న‌వ్వేవాళ్లూ న‌వ్వ‌నీ.. ఏడ్చే వాళ్లూ ఏడ్వ‌నీ.. తిట్టేవాళ్లూ తిట్ట‌నీ.. పొగిడేవాళ్లూ పొగ‌డ‌నీ.. డోన్ట్ కేర్’’ అంటూ ఓ ఫేమ‌స్ పాట ఉంది. ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పాట‌ను నిత్యం హ‌మ్ చేస్తోంది కొత్తపెళ్లి కూతురు సునీత‌. తన లైఫ్ కు అప్లై చేసుకొని, తన గాత్రాన్ని మిక్స్ చేసి ఇరగదీస్తోందని చెప్పొచ్చు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సింగర్ సునీత పిక్స్ చూస్తే.. మీరు కూడా ఇదే అంటారు. భ‌ర్త రామ్ వీర‌ప‌నేనితో హ‌నీమూన్ వెకేష‌న్‌లో.. ఆనందంలో తేలియాడుతున్న సునీత‌.. రెక్క‌లు క‌ట్టుకుని విహ‌రిస్తోంది.

    Also Read: వీర‌మ‌ల్లు హీరోచిత విన్యాసాలు.. అశ్వ సార‌థ్యంలో చుక్క‌లేన‌ట‌!

    సునీత మొద‌టి పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. రెండో పెళ్లి గురించి తెలియని వారు మాత్రం పెద్ద‌గా ఉండ‌రు. మ్యాంగో మూవీస్ అధినేత, బిజినెస్ మెన్‌ రామ్ వీర‌ప‌నేనితో జ‌న‌వ‌రి 9వ తేదీన సునీత పెళ్లి జ‌రిగింది. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని సీతారామ‌చంద్ర‌స్వామి ఆల‌యంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు.

    అయితే.. వీరిద్ద‌రి పెళ్లి ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. వీళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డి, ఈ రెండు కుటుంబాల వారి అంగీకారంతో పెళ్లి చేసుకుంటే.. ఎందుకో తెలియ‌దు కొంద‌రు జ‌నాలు హ‌ర్టైపోయారు! ఈ వ‌య‌సులో ఇదేంటీ..? అని మూతీ ముక్కు ముప్పైమూడు వంక‌ర్లు తిప్పారు. అయినా.. అవ‌న్నీ లైట్ తీసుకున్న సునీతారామ్ వైభ‌వంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

    అయితే.. మ‌న‌ల్ని చూసి కుళ్లుకునేవారి ముందు మ‌రింత ఆనందంగా జీవించ‌డ‌మే స‌రైన స‌మాధానం అన్న‌ట్టుగా.. రెచ్చిపోతున్నారు సింగ‌ర్‌ సునీత‌. త‌న లైఫ్ కు సంబంధించిన ప్ర‌తీ అప్డేట్ ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా మాల్దీవుల్లో వాలిపోయి హనీమూన్ ట్రిప్ మొదలు పెట్టిన సునీతారామ్.. ఆ వెకేషన్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.

    Also Read: మెగాస్టార్ మాట మీద నిలబడతారా ?

    ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా.. తనను ద్వేషించే వారికి ఘాటుగా పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ‘నన్ను ద్వేషిస్తారు.. నన్ను నిందిస్తారు.. కనీసం నేను చెప్పేది కూడా వినరు.. నేను ఓడిపోతే మాత్రం నవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అయినా నో ప్రాబ్లం.. నేను మహిళను అన్నింటినీ భరిస్తాను’ అంటూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సమాధానం ఇచ్చిన సునీత.. దానికి కొనసాగింపు అన్నట్టుగా.. భర్తతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ ఆనందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్