https://oktelugu.com/

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఎవరికంటే?

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు.. టీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ సైతం లీడర్లకు ఆ దిశగానే సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. అయితే.. దీనికంటే ముందే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌‌ఎస్‌కు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియకుండా ఉంది. Also Read: మున్సిపోల్స్: ఏ పార్టీ ఎక్కడ గెలిచింది.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 15, 2021 / 09:58 AM IST
    Follow us on


    మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు.. టీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ సైతం లీడర్లకు ఆ దిశగానే సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. అయితే.. దీనికంటే ముందే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌‌ఎస్‌కు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియకుండా ఉంది.

    Also Read: మున్సిపోల్స్: ఏ పార్టీ ఎక్కడ గెలిచింది.. ఎక్కడ ఓడింది?

    సాగర్ ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్‌కు విజయం ఖచ్చితంగా దక్కుతుందన్న అంచనా లేదు. రెండు స్థానాల్లో కేసీఆర్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపినా ప్రభుత్వ వ్యతిరేకత ఇబ్బందిగా మారనుంది. అయితే.. ఎక్కువ మంది పోటీ చేస్తుండటంతో వ్యతిరేక ఓట్లు చీలి తమ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ గెలుస్తారన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారు.

    మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి కేసీఆర్ పీవీ కుమార్తె వాణీదేవిని ఎంపిక చేశారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయంతోనే పార్టీకి కొంత హైప్ వచ్చింది. పీవీ కుమార్తె కావడంతో కొంత గెలుపు అవకాశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ పడుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి టీఆర్ఎస్ లబ్ధి పొందుతుందని అంచనా వేస్తున్నారు.

    Also Read: ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు.. ఎలా అంటే..?

    మరో స్థానమైన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానానికి కూడా ఎన్నిక జరిగింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే టీఆర్‌‌ఎస్‌ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమచంద్ రెడ్డి పోటీ చేస్తున్నా తెలంగాణ జనసమితినేత కోదండరామ్ బరిలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు తెలంగాణ ఉద్యమకారులు సైతం పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలుతుందని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు.

    ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం లభిస్తుందని, ప్రజలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఎన్నికల్లో పర్ ఫార్మెన్స్ బాగుంటేనే సాగర్ ఉప ఎన్నికలలో విజయం దక్కనుంది. అందుకే కేసీఆర్ ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్