https://oktelugu.com/

వాట్సాప్ వాడే కస్టమర్లకు షాకింగ్ న్యూస్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వాట్సాప్ వినియోగించే వినియోగదారులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణ కస్టమర్లు చార్జీల గురించి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం బిజినెస్ సర్వీసులకు మాత్రమే వాట్సాప్ ఛార్జీలను వసూలు చేయనుంది. చార్జీలను వసూలు చేయడం వల్ల వాట్సాప్ మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఎక్కువగా వాట్సాప్ బిజినెస్ సర్వీసులను వినియోగించుకుంటారు. తమ వ్యాపారాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 24, 2020 9:20 am
    Follow us on


    ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వాట్సాప్ వినియోగించే వినియోగదారులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణ కస్టమర్లు చార్జీల గురించి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం బిజినెస్ సర్వీసులకు మాత్రమే వాట్సాప్ ఛార్జీలను వసూలు చేయనుంది. చార్జీలను వసూలు చేయడం వల్ల వాట్సాప్ మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

    చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఎక్కువగా వాట్సాప్ బిజినెస్ సర్వీసులను వినియోగించుకుంటారు. తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి వాట్సాప్ బిజినెస్ సర్వీసులు ఉపయోగపడుతుంటాయి. బిజినెస్ సర్వీసుల ద్వారా వాట్సాప్ ఉత్పత్తులను నేరుగా విక్రయించే సదుపాయం కల్పించడంతో పాటు వారి కస్టమర్లకు చాట్ సర్వీసులను కూడా అందిస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

    వాట్సాప్ చాలా సంవత్సరాల నుంచి ఉచితంగానే బిజినెస్ సర్వీసులను అందిస్తోంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం వినియోగదారుల నుంచి బిజినెస్ సర్వీసులకు మాత్రం చార్జీలను వసూలు చేయనుంది. 2014 సంవత్సరంలో 16 బిలియన్ డాలర్లు చెల్లించి ఫేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసింది. మరోవైపు వాట్సాప్ తమ కస్టమర్లకు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెస్తోంది.

    నిన్న ఆల్ వేస్ మ్యూట్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ పేమెంట్ సర్వీసులను కూడా త్వరలో ప్రారంభించనుంది. టెక్ నిపుణులు వాట్సాప్ నుంచి ఆదాయం లేకపోవడం వల్లే వాట్సాప్ చార్జీలను వసూలు చేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.