ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) చైర్మన్ పదవి భారత్‌కు దక్కింది. 35 సంవత్సరాల తరువాత భారత్‌కు చెందిన అపూర్వచంద్ర ఈ పదవికి ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న అపూర్వ చంద్ర 1998 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. భారత్‌కు అధ్యక్ష పదవి దక్కడి ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇందులో 187 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వచ్చే నవంబర్‌లో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహించనున్నారు. జెనీవాలోని సభ్యదేశాల ఉన్నతాధికారులు, సామాజిక భాగస్వాములతో ఆయన సమావేశం కానున్నారు. మహారాష్ట్రకు చెందిన చంద్ర అక్కడి ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా 2013-2017 మధ్య కాలంలో పనిచేశాడు.