https://oktelugu.com/

కేసీఆర్‌.. మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమం నుంచి పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా చేసి తీరుతాడనే నమ్మకం ప్రజల్లో బలపడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి అయిన రెండు పర్యాయాల్లోనూ కేసీఆర్‌ ప్రతీ విషయంపై నిక్కచ్చిగా నిలబడుతూ వస్తున్నాడు. ప్రతిపక్షాలు ఎటువంటి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. చివరికి దాదాపు 60 రోజుల పాటు చేసిన ఆర్టీసీ సమ్మెను చూసి కూడా జడవలేదు. కానీ మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 09:19 AM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమం నుంచి పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా చేసి తీరుతాడనే నమ్మకం ప్రజల్లో బలపడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి అయిన రెండు పర్యాయాల్లోనూ కేసీఆర్‌ ప్రతీ విషయంపై నిక్కచ్చిగా నిలబడుతూ వస్తున్నాడు. ప్రతిపక్షాలు ఎటువంటి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. చివరికి దాదాపు 60 రోజుల పాటు చేసిన ఆర్టీసీ సమ్మెను చూసి కూడా జడవలేదు. కానీ మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అదీ రైతుల కోసం..

    Also Read: హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..?

    కేసీఆర్‌కు రైతులంటే ప్రాణం.. రైతును అభివృద్ధి చేయడంలోనే ప్రాధాన్యత నిస్తాడని పరోక్షంగా ఆయన.. ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే రైతులకు ప్రత్యేక ఆకర్షక పథకాలు ప్రవేశపెడుతూ వారి మన్ననలను పొందుతున్నాడు. ప్రతీ రైతు బంధువుడు కేసీఆర్‌ అని చెప్పుకునే విధంగా ‘రైతుబంధు’, ‘రైతు బీమా’ లాంటి పథకాలను ప్రవేశపెట్టాడు. తాజాగా ‘రైతు వేదిక’లను యుద్ధ ప్రాతిపదికగా నిర్మిస్తూ వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

    తాజాగా కేసీఆర్‌ మరోసారి రైతుపక్షపాతి అనిపించుకున్నాడని చర్చ సాగుతోంది. వానకాలం పంటకు ముందు రాష్ట్రంలో ఏ పంట వేయాలి..? దేనికి మద్దతు ధర వస్తుంది..? అనే విషయాలపై చర్చించారు. ముఖ్యంగా మక్కలకు మద్దతు ధర లేదని ఆ పంటను ఎక్కువ శాతం వేయొద్దని సూచించారు. అయితే గత్యంతరం లేని కొందరు రైతులు ఆ పంటలను ముందుగానే వేసుకున్నారు. దీంతో ఇప్పుడు దిగుబడి వచ్చిన తరువాత తమ పంటను కొనుగోలు చేయాలని ఆందోళన నిర్వహించారు. తమ పంటను ఎవరూ కొనకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

    Also Read: త్రిశంకు స్వర్గంలో ‘పోలవరం’.. ప్రాజెక్టు పూర్తయ్యేనా..?

    దీంతో కేసీఆర్‌ ఈ ఆందోళనపై స్పందించారు.ప్రస్తుతం మక్కలను కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అయితే యాసంగిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొక్కజొన్న సాగు చేయవద్దని సూచిస్తున్నారు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్‌ రైతుల కోసం మొదటిసారిగా ఒక్క అడుగు వెనక్కి వేయక తప్పలేదని అని చర్చించుకుంటున్నారు.