https://oktelugu.com/

కొత్త కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో కొత్త కార్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగులుతోంది. కొత్త కారు బుక్ చేసుకున్న వాళ్లకు బుక్ చేసుకున్న రెండు మూడు నెలలకు కూడా కారు డెలివరీ కావడం లేదు. ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం. Also Read: బీటెక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 20, 2021 1:17 pm
    Follow us on

    New Car Buying.

    కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో కొత్త కార్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగులుతోంది. కొత్త కారు బుక్ చేసుకున్న వాళ్లకు బుక్ చేసుకున్న రెండు మూడు నెలలకు కూడా కారు డెలివరీ కావడం లేదు. ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం.

    Also Read: బీటెక్ అర్హతతో 35 ఉద్యోగాలు.. రూ.1,40,000 వేతనంతో..?

    ఎక్కువ ఆదరణ ఉన్న కార్లను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు తప్పనిసరిగా కొత్త కారును కొనుగోలు చేయడానికి వేచి ఉండాల్సిందే. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాల ఉత్పత్తి తగ్గిపోవడం, గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడంతో ఆ ప్రభావం వల్ల కొన్ని కంపెనీలు కార్లను సకాలంలో కస్టమర్లకు డెలివరీ చేయలేకపోతున్నాయి. మన దేశంలోని కంపెనీలు కార్లలో వినియోగించే చిప్ ల కోసం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంటాయి.

    Also Read: ఉచితంగా క్యాబ్ బుక్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

    ప్రస్తుతం ఇతర దేశాల నుంచి ఆశించిన స్థాయిలో చిప్ లు రాకపోవడం వల్ల డిమాండ్ ఉన్న కార్ల డెలివరీ ఆలస్యమవుతోంది. కార్లలో ఏసీ, ఇంజన్, నావిగేషన్ లను చిప్ లతో అనుసంధానం చేయడంతో చిప్ లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం భారీగా పెరగడంతో చిప్ లకు సంబంధించిన సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి.

    మారుతి సుజుకి ఎర్టిగా, వ్యాగన్ ఆర్ కార్లను వేగంగా డెలివరీ చేయలేకపోతుండగా కొన్ని కంపెనీల కార్ల కోసం మూడు నుంచి నాలుగు నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టయోటా కంపెనీ ముందుగానే చిప్ లు, విడిభాగాలను సిద్ధం చేసుకోవడంతో ఆ కంపెనీ మాత్రం కార్లను వెంటనే డెలివరీ చేస్తోందని తెలుస్తోంది.