https://oktelugu.com/

చిరంజీవి ‘ఆచార్య’ గురించి షాకింగ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’ ఈ మూవీని దిగ్గజ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూనే ఉంది. ఈ మధ్యనే స్పీడ్ అందుకోగా.. తాజాగా షూటింగ్ లో ‘చిరంజీవి’ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మే 13న ‘ఆచార్య’ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2021 / 10:28 AM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’ ఈ మూవీని దిగ్గజ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూనే ఉంది. ఈ మధ్యనే స్పీడ్ అందుకోగా.. తాజాగా షూటింగ్ లో ‘చిరంజీవి’ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    మే 13న ‘ఆచార్య’ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అన్ని ఏర్పాట్లు చస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా ఆ డేట్ కు విడుదల కావడం డౌట్ అంటున్నారు. ఈ మేరకు బయ్యర్లకు వర్తమానం పంపినట్టు సమాచారం.

    చిరంజీవి సిక్ కావడంతో ఇప్పటికే డేట్స్ ఇచ్చిన సోనూసూద్, ఇతర స్టార్ల డేట్స్ క్లాష్ అయిపోయాయి. దీంతో వారు మళ్లీ రావాలన్నా.. చిరంజీవి కోలుకోవాలన్నా సమయం ఆలస్యం అవుతుంది. అందుకే ‘ఆచార్య’ మూవీ ఈ మే నెలలో రిలీజ్ కావడం కష్టమేనన్న ప్రచారం మొదలైంది. చిరంజీవి ఎంత వేగంగా కోలుకొని వస్తే అంత త్వరగా ఈ సినిమా పట్టాలెక్కుతుంది లేదంటే ఆలస్యం తప్పదన్న చర్చ సాగుతోంది.