షాకిచ్చిన టాప్ హీరోయిన్.. మేకప్ లేకుండా పూజా హెగ్డెను చూస్తారా?

టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ టాలీవుడ్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్ తో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే, పూజా.. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ‘పూజా హెగ్డే’ పాత్ర చనిపోతుందని.. తానూ ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని […]

Written By: NARESH, Updated On : March 10, 2021 10:37 am
Follow us on

టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ టాలీవుడ్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్ తో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే, పూజా.. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ‘పూజా హెగ్డే’ పాత్ర చనిపోతుందని.. తానూ ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని తెలిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటుందని.. మొత్తంగా ఆమె పాత్ర అలాగే ఆమె డెత్ సీన్ సినిమాలోనే వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమాలో పూజా మేకప్ లేకుండా నటిస్తోందట.. ఆమె ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

‘ముకుంద’సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పూజా. ఆ సినిమాలో ఈమెను చూసిన మొదటి చూపులోనే బాగుందన్నారు.. కానీ తాజాగా ఆమె ఫొటోలను చూసి షాకవుతున్నారు. ‘ముకుంద’ సినిమాతో తెరంగేట్రం చేసినా ‘మహర్షి’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డె. ఆ తరువాత ఎన్టీఆర్ తో ‘అరవింత సమేత’, అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురం’ సినిమాలో అలరించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ హీరోయిన్ తాజాగా మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను రిలీజ్ చేసింది.

ఈ ఫొటోలను చూసిన వాళ్లంగా ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మేకప్ లేకుండా పూజ ఇలా ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారు.

జిమ్ వర్కౌట్ చేసే డ్రెస్సులో ఉన్న పూజ ను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లోకి, రియల్ గా ఉన్న ఫేస్ కు కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే పూజ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది.