ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై కన్నేసిన బీజేపీ.. ఇటు తెలుగు రాష్ట్రాలపైనే ఓ నజర్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేసుకుంటోంది. అందుకే.. ఏపీ పరిణామాలపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమని కూడా చెబుతున్నారు పీఎంవోలోని కీలక అధికారులు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read: చంద్రబాబు, జగన్, పవన్ భవిష్యత్ ను తేల్చే ‘పురపోరు’ ఇదీ!
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఎవరూ ఎదురు చెప్పకుండా ఇప్పటికే పలు పార్టీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. బహుశా ఈ క్రమంలోనే అటు ప్రతిపక్షం టీడీపీ, ఇటు అధికార పక్షం వైసీపీ నామమాత్రంగానే విశాఖ ఉక్కుపై ఉద్యమాలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పిన తర్వాత కూడా పదేపదే సీఎం జగన్ ప్రస్తావించడాన్ని కూడా మోడీ సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే తేల్చేశామని.. మళ్లీ మళ్లీ అడిగి తమను బద్నాం చేయాలని చూస్తున్నారనే భావనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
అంతేకాదు.. ఇకపై ప్రత్యేక హోదా ప్రస్తావనను తీసుకురాకూడదని తాజాగా కేంద్రం నుంచి ఏపీకి లేఖ అందినట్టు తెలుస్తోంది. పోలవరం నిధుల విషయంలోనూ ఒత్తిడి చేయరాదని.. ఈ విషయంలో 2014 లెక్కల ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తామని కూడా తెగేసి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్రాన్ని.. ప్రధాని మోడీని బద్నాం చేసేలా ఎవరు వ్యవహరించినా.. సీరియస్‌గానే పరిగణించాలని నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం జగన్ కానీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షాలు.. టీడీపీ, జనసేనలు మౌనం పాటిస్తున్నాయి. ఈ విషయంలో ఇంతకు మించి చెప్పేది ఏమీలేదని.. అన్నీ చేతలే ఉంటాయని కూడా కేంద్రం హెచ్చరించిందని కూడా తెలుస్తోంది.
Also Read: ఏపీలో పురపోరు.. కొనసాగుతున్న పోలింగ్.. హైలైట్స్ ఇవే
దేశవ్యాప్తంగా మోడీని విమర్శించే ప్రతిపక్ష పార్టీల సీఎంలకు ముందు పద్ధతిగా చెప్పడం.. లేదంటే టార్గెట్ చేయడంతో పాటు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా చేయడమే కేంద్రం చేసే పని. ఇప్పుడు అదే పంథా ఏపీలోనూ ఫాలో అవుతూ ఇక్కడ మోడీని అధికార, ప్రతిపక్షాలు కూడా విమర్శించే ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరిపై ఏ కేసులు పెట్టి లోపల వేస్తారోననే భయం చాలా మందిలోనూ కనిపిస్తోంది. అందుకే.. కేంద్రం నిర్ణయాలకు ఎవరూ కూడా నోరెత్తి ప్రశ్నించడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్