https://oktelugu.com/

నిమ్మగడ్డకు షాక్: పంచాయితీకి నై.. ఏపీ ఉద్యోగుల తిరుగుబాటు

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు చిచ్చుపెడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ ఏపీ సీఎం జగన్ లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకూ ఈ ‘పంచాయితీ’ వెళ్లింది. ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. జగన్ సర్కార్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అక్కడ జాప్యం జరగడంతో ఉత్కంఠ నెలకొంది. Also Read: నేతల తారక మంత్రం.. రాష్ట్రంలో చర్చనీయాంశం.. ఈ ఆలస్యాన్ని క్యాష్ చేసుకుంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2021 / 02:28 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు చిచ్చుపెడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ ఏపీ సీఎం జగన్ లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకూ ఈ ‘పంచాయితీ’ వెళ్లింది. ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. జగన్ సర్కార్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అక్కడ జాప్యం జరగడంతో ఉత్కంఠ నెలకొంది.

    Also Read: నేతల తారక మంత్రం.. రాష్ట్రంలో చర్చనీయాంశం..

    ఈ ఆలస్యాన్ని క్యాష్ చేసుకుంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈరోజు ఉదయం ఏకంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఏపీలో పంచాయితీ ఎన్నికల నగారాను మోగించారు. అయితే జగన్ సర్కార్ తోపాటు ఏపీ ఉద్యోగులు కూడా దీన్ని అమలు చేసేందుకు సిద్ధంగా లేరు.

    ఈ క్రమంలోనే జగన్ సర్కార్ కు మద్దతుగా తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉద్యోగుల సంఘం స్పందించింది.

    Also Read: ఆ మహిళకు 31సార్లు కరోనా పాజిటివ్.. అసలేం జరిగిందంటే..?

    సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని’ స్పష్టం చేశారు. మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉంది. రాజ్యాంగం కూడా కల్పించింది. ప్రాణాపాయం వస్తే ఎదుటివాణ్ని చంపే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది. మా హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నాం.. ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్ఈసీ ఉన్నారు. విధుల్లో పాల్గొనడానికి సమ్మతించే ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకోవచ్చు’ అని ఉద్యోగుల సంఘం చైర్మన్ కుండబద్దలు కొట్టారు.

    దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా వాటిని అమలు జరిపే ఏపీ ఉద్యోగులు తిరుగుబాటు చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు, జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న వేళ ఏపీలో అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్న టెన్షన్ నెలకొంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్