నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం పార్టీలు సన్నద్ధం అవున్నాయి. జానారెడ్డిని బరిలో దింపుతామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. జానాకు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో హస్తం విజయంపై కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే జానారెడ్డి అక్కడ అంతా తానై తిరుగుతూనే అందరినీ కలుపుకుపోతున్నాడు. ఇక దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బీజేపీ నాగర్జునసాగర్లో సత్తా చాటాలని భావిస్తోంది.
Also Read: నిమ్మగడ్డకు షాక్: పంచాయితీకి నై.. ఏపీ ఉద్యోగుల తిరుగుబాటు
జానారెడ్డి లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టాలంటే.. చాలా రిస్క్ చేయాలి. ఈ క్రమంలో.. కొత్తవ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతిని సాగర్ బరిలో దింపాలనే యోచనలో కమలం అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. విజయశాంతి ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. బాగుంటుందని నల్లగొండ నాయకులు, కార్యకర్తలు సైతం అంటున్నారు. సినీ గ్లామర్ కు తోడు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విజయశాంతి చేస్తున్న విమర్శలు.. తమకు కలిసి వస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై.. కమలనాథులు అంతర్గతంగా ఓ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి బరిలోకి దిగితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: నేతల తారక మంత్రం.. రాష్ట్రంలో చర్చనీయాంశం..
ఇక టీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ బైపోల్ ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి ఖరారు దాదాపు ఖరారుకాగా.. టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో.. ఇంకా తేలలేదు. నోముల కుమారుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్