https://oktelugu.com/

కేజీఎఫ్ 2 మూవీ తెలుగు హక్కులు అన్ని కోట్లా..?

2018 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీన క్రిస్ మస్ పండుగ సందర్భంగా విడుదలై కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 1. వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి కేజీఎఫ్ మూవీ హక్కులను కొనుగోలు చేయగా పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చాయి. తెలుగులో బాహుబలి సిరీస్ ద్వారా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఏ విధంగా గుర్తింపు వచ్చిందో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 02:16 PM IST
    Follow us on

    2018 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీన క్రిస్ మస్ పండుగ సందర్భంగా విడుదలై కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 1. వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి కేజీఎఫ్ మూవీ హక్కులను కొనుగోలు చేయగా పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చాయి. తెలుగులో బాహుబలి సిరీస్ ద్వారా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఏ విధంగా గుర్తింపు వచ్చిందో యశ్ కు కూడా కేజీఎఫ్ సినిమా ద్వారా అదే తరహా గుర్తింపు వచ్చింది.

    Also Read: అల్లరోడి ఆశలు ఈ సినిమాపైనే.. కల నెరవేరుతుందా..?

    ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు తెలుగులో స్టార్ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇకపోతే కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ తెలుగు హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉండగా టీజర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు భారీగా పెరిగాయి.

    Also Read: వామ్మో.. సాయితేజ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

    కేజీఎఫ్ ఛాప్టర్ 1తో పోల్చి చూస్తే ఆరేడు రెట్లు ఎక్కువగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడగా 60 కోట్ల రూపాయలకు డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు కూడా భారీగా డిమాండ్ ఉండటంతో ఇంత మొత్తం ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేయడానికి సాయి కొర్రపాటి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మరోవైపు యశ్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 కు 11 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న యశ్ ఛాప్టర్ 2కు మాత్రం భారీ మొత్తం పారితోషికంగా అందుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.