https://oktelugu.com/

టీమిండియాకు షాక్: బయటకొచ్చిన ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్ కు..

ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో గెలిచి జోరుమీదున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. తాజాగా మెల్ బోర్న్ లోనే ప్రాక్టీసు చేస్తున్న టీమిండియా ఐదుగురు క్రికెటర్లు అక్కడి హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. దీన్ని అక్కడి భారత అభిమాని చూసి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఈ ఐదుగురు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. Also Read: గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 09:46 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో గెలిచి జోరుమీదున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. తాజాగా మెల్ బోర్న్ లోనే ప్రాక్టీసు చేస్తున్న టీమిండియా ఐదుగురు క్రికెటర్లు అక్కడి హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. దీన్ని అక్కడి భారత అభిమాని చూసి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఈ ఐదుగురు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు.

    Also Read: గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు

    టీమిండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను తాజాగా ఐసోలేషన్ కు పంపించారు. మెల్ బోర్న్ లోని ఓ హోటల్ లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వీరు బయో బుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

    నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నవదీప్ సైని, శుభ్ మన్ గిల్, ఫృథ్వీషాలు మెల్ బోర్న్ లోని ఓ హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. వీరి బిల్లును ఓ ఆస్ట్రేలియాలోని భారత అభిమాని కట్టాడు. వారితో దగ్గరకు కూడా వెళ్లాడని తెలిసింది. అతడు కట్టిన బిల్లును రోహిత్ శర్మ తిరిగి ఇచ్చేశాడని తెలిపాడు.

    Also Read: టీమిండియాకు అభిమాని సర్‌‌ప్రైజ్‌

    అయితే కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఐదుగురు ఆటగాళ్లను భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి వేరుచేశారు. మిగతా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇలా చేశాం అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీనిపై ప్రస్తుతం బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తు చేపట్టాయి. టెస్టు సిరీస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఐదుగురిని విడదీశాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించారు.

    మెల్ బోర్న్ లో కరోనా కేసులు తక్కువ దృష్ట్యా క్రికెటర్లు బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నారని.. ఇది తప్పా కాదా అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.