https://oktelugu.com/

డ్రై రన్ బేషుగ్గా ఉందని కితాబిచ్చిన గవర్నర్ తమిళ సై..!

కరోనా వ్యాక్సిన్ ను కొత్త ఏడాదిలో పంపిణీ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. డిసెంబర్ 28.. 29 తేదిల్లో అస్సాం.. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం డ్రై రన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కేంద్రం చేపట్టింది. Also Read: మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి డ్రై రన్ కోసం కేంద్రం ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతోంది. ఈ డ్రై రన్ పూర్తయిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 09:22 PM IST
    Follow us on

    కరోనా వ్యాక్సిన్ ను కొత్త ఏడాదిలో పంపిణీ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. డిసెంబర్ 28.. 29 తేదిల్లో అస్సాం.. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం డ్రై రన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కేంద్రం చేపట్టింది.

    Also Read: మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

    డ్రై రన్ కోసం కేంద్రం ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతోంది. ఈ డ్రై రన్ పూర్తయిన తర్వాత కేంద్రం అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా నేడు తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరిగింది.

    తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న డ్రై రన్ కార్యక్రమాన్ని శనివారం గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ స్వయంగా పరిశీలించారు. నల్లకుంటలోని తిలక్ నగర్ యూపీహెచ్ సీలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని పనులను పర్యవేక్షించారు.

    Also Read: టీఆర్ఎస్ తో ‘పొత్తు’పై బండి సంచలన కామెంట్స్..!

    తెలంగాణలో డ్రై రన్ కోసం చేసిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని గవర్నర్ తమిళ సై సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఒక బృహత్తరమైన కార్యక్రమం అని తెలిపారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతోనే అందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 80లక్షల మందిని గుర్తించి వ్యాక్సిన్ వేసేందుకు జాబితా రూపొందించినట్లు గవర్నర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ నాలుగు విడతల్లో వేయడం జరుగతుందని తెలిపారు. తొలి విడతలో హెల్త్ సిబ్బందితోపాటు మొత్తంగా ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్