https://oktelugu.com/

నాడు అంజయ్య.. నేడు కేసీఆర్.. టీఆర్ఎస్ అటాక్

తెలంగాణలో ఈ ఒక్క రోజే అటు ప్రధాని మోడీ పర్యటన.. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బహిరంగ సభలు ఉన్నాయి. గ్రేటర్‌‌ ఎన్నికల నేపథ్యంలో ఒకేరోజు ఇద్దరి కార్యక్రమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే.. ఏ రాష్ట్రానికి పీఎం వచ్చినా ఆ రాష్ట్ర సీఎంకు ఆహ్వానం ఉంటుంది. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం హాజరుకావాల్సి ఉంటుంది. కానీ.. విచిత్రంగా నేటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్‌‌ను దూరంగా పెట్టారు. ఇది కాస్త ఇప్పుడు వివాదం అవుతోంది. ప్రధాని మోదీకి స్వాగతం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 2:58 pm
    Follow us on

    kcr modi

    kcr modi

    తెలంగాణలో ఈ ఒక్క రోజే అటు ప్రధాని మోడీ పర్యటన.. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బహిరంగ సభలు ఉన్నాయి. గ్రేటర్‌‌ ఎన్నికల నేపథ్యంలో ఒకేరోజు ఇద్దరి కార్యక్రమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే.. ఏ రాష్ట్రానికి పీఎం వచ్చినా ఆ రాష్ట్ర సీఎంకు ఆహ్వానం ఉంటుంది. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం హాజరుకావాల్సి ఉంటుంది. కానీ.. విచిత్రంగా నేటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్‌‌ను దూరంగా పెట్టారు. ఇది కాస్త ఇప్పుడు వివాదం అవుతోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం ప్రత్యేక సమాచారం ఇచ్చింది.

    Also Read: సంజయ్‌.. అక్బరుద్దీన్‌లకు షాకిచ్చిన కేసీఆర్ సర్కార్

    ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్‌ ఆసిఫ్ చీఫ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది.

    ఈ అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సంప్రదాయాలకు, ప్రొటోకాల్‌కు తిలోదకాలిచ్చేలా ప్రధాని వ్యవహరించిన తీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాష్ట్ర ప్రభుత్వం, ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్లు ఈనాడు కేసీఆర్‌ను మోదీ అవమానిస్తున్నారని విమర్శించారు.

    Also Read: మంటపెట్టిన బీజేపీ ఎంపీ.. భగ్గుమన్న జనసేన..పొత్తు క్యాన్సిల్?

    రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్యను ఆయన అవమానించారన్న విమర్శలున్నాయి. టి.అంజయ్య దళితుడు కాబట్టే రాజీవ్ గాంధీ ఆయన్ను అవమానించారని రెండేళ్ల క్రితం బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. నిజానికి టి.అంజయ్య దళితుడు కాదు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారన్నది పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పే మాట. ఒకప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. సీఎం అంజయ్యను అవమానించారని పార్లమెంటులో మాట్లాడిన మోదీనే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎంను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రధాని హోదాలో హైదరాబాద్ వస్తున్నారా లేక బీజేపీ నేతగా వస్తున్నారా అని నిలదీస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్