https://oktelugu.com/

సంజయ్‌.. అక్బరుద్దీన్‌లకు షాకిచ్చిన కేసీఆర్ సర్కార్

ఎన్నడూ లేనంతగా ఈసారి గ్రేటర్‌‌ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొలదీ ఇంకా విమర్శలు.. ప్రతివిమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత బస్తీని టార్గెట్‌ చేసి మాట్లాడారు. పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ హెచ్చరించారు. Also Read: మంటపెట్టిన బీజేపీ ఎంపీ.. భగ్గుమన్న జనసేన..పొత్తు క్యాన్సిల్? ఆ తర్వాత ఆక్రమణల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 02:12 PM IST
    Follow us on

    ఎన్నడూ లేనంతగా ఈసారి గ్రేటర్‌‌ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొలదీ ఇంకా విమర్శలు.. ప్రతివిమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత బస్తీని టార్గెట్‌ చేసి మాట్లాడారు. పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ హెచ్చరించారు.

    Also Read: మంటపెట్టిన బీజేపీ ఎంపీ.. భగ్గుమన్న జనసేన..పొత్తు క్యాన్సిల్?

    ఆ తర్వాత ఆక్రమణల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ పీవీ ఘాట్లను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తం చేశారు. దానికి కౌంటర్‌‌గా బండి సంజయ్ దారుస్సలాంలో ఉన్న ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని రెండు గంటల్లో తమ కార్యకర్తలు కూల్చివేశారంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ దుమారాన్ని రేపాయి.

    ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -ఎంపీ బండి సంజయ్.. ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు వీరిద్దరిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు ఐపీఎస్ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

    Also Read: గ్రేటర్ వార్: పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఫ్యాన్స్ వార్నింగ్

    ముందుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇద్దరి దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఓయూలోకి అనుమతి లేకుండా వెళ్లి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్