ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 52 కోట్ల రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా హ్యాండ్ బ్యాగ్ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా 300 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య ఉంటుందని చెబుతారు. సినిమా, టీవీ లేడీ సెలబ్రిటీలు మాత్రం లక్షలు విలువజేసే హ్యాండ్ బ్యాగ్ లను వాడుతూ ఉంటారు. అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు మాత్రం ఏకంగా 52 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ఇంత ఎక్కువ రేటు పలకడానికి ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. […]

Written By: Navya, Updated On : November 28, 2020 4:30 pm
Follow us on


సాధారణంగా హ్యాండ్ బ్యాగ్ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా 300 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య ఉంటుందని చెబుతారు. సినిమా, టీవీ లేడీ సెలబ్రిటీలు మాత్రం లక్షలు విలువజేసే హ్యాండ్ బ్యాగ్ లను వాడుతూ ఉంటారు. అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు మాత్రం ఏకంగా 52 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ఇంత ఎక్కువ రేటు పలకడానికి ముఖ్యమైన కారణాలే ఉన్నాయి.

Also Read: మంటపెట్టిన బీజేపీ ఎంపీ.. భగ్గుమన్న జనసేన..పొత్తు క్యాన్సిల్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హ్యాండ్ బ్యాగ్ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ ను మొసలి చర్మంతో తయారు చేశారు. ఈ బ్యాగ్ పై ఉన్న సీతాకోక చిలుకలను బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, నీలమణీలు, పారాబా టూర్మలైన్లను ఈ హ్యాండ్ బ్యాగ్ లో పొందుపరిచారు. అందువల్లే హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 52 కోట్ల రూపాయలు పలుకుతోంది. బోరిని మిలానేసి అనే ఇటలీ సంస్థ ఈ హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసింది.

Also Read: స్టార్ హీరోల సినిమాలు పండుగకేనట.. కానీ చిన్న ట్వీస్ట్..!

పర్వా మియా బ్యాగ్ పేరుతో పిలిచే ఈ బ్యాగ్ బొలాంగా బ్రాండ్‌ కు చెందినది. ఈ బ్యాగ్ ను తయారు చేయడం సులభం కాదని.. 41 రోజులు ఈ హ్యాండ్ బ్యాగ్ కోసం శ్రమించాల్సి ఉంటుందని బోరిని మిలానేసి సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంస్థ విడుదల చేసిన ఈ బ్యాగ్ చూడటానికి ఎంతో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: వైరల్

అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర వింటే మాత్రం గుండె గుభేలుమంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత ఖరీదైన బ్యాగ్ ను తయారు చేసినందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు. ఈ బ్యాగ్ అమ్మగా వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు సముద్రాలను శుభ్రం చేసేందుకు ఖర్చు చేస్తామని వెల్లడించారు.