https://oktelugu.com/

స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు..?

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొత్తగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌ను ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్ కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రియల్‌మి సి12, పోకో సి3, రియల్‌మి నర్జో 30ఎ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. Also Read: కొత్త […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 8, 2021 / 08:26 PM IST
    Follow us on

    ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొత్తగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌ను ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్ కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రియల్‌మి సి12, పోకో సి3, రియల్‌మి నర్జో 30ఎ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.

    Also Read: కొత్త స్కూటర్ కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా రూ.5000 డిస్కౌంట్..?

    యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఏకంగా 1,250 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించడం గమనార్హం. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఈ డిస్కౌంట్లు అమలులో ఉంటాయి. ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ మోడల్ ధరను ఫ్లిప్ కార్ట్ ఏకంగా రూ.34,999 నుంచి రూ. 29,999కి ఫ్లిప్ కార్ట్ తగ్గించింది.

    Also Read: మార్చి 31లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే నష్టపోయే ఛాన్స్..?

    ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ స్టోరేజీ మోడల్ ధరను ఫ్లిప్ కార్ట్ రూ.45,984 నుంచి రూ.38,999కి తగ్గించింది. . శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5,000 రూపాయల రాయితీ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ పాత ఫోన్ల ఎక్స్ ‌చేంజ్‌పై అదనంగా 7,000 రూపాయల రాయితీ కల్పించింది. రెడ్‌మి 9 ప్రొ మ్యాక్స్‌ పై ఫ్లిప్ కార్ట్ 2,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. మోటో జి 5జి ధర ఫ్లిప్ కార్ట్ లో 21,200 రూపాయలుగా ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఫ్లిప్ కార్ట్ లో ఐక్యూ 3 ధర 24,990 రూపాయలుగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 కొనుగోలుపై ఫ్లిప్ కార్ట్ 1,500 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్‌మి సి12 3 జీబీ ర్యామ్+32 జీబీ వేరియంట్‌ పై ఫ్లిప్ కార్ట్ 500 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది.