ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. రూ.10 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్బీఐ యోనో యాప్ లో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫామ్ ద్వారా టూవీలర్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ రుణాలను ఇవ్వనుంది. రెండున్నర లక్షల రూపాయల వరకు టూవీలర్ రుణాలను ఇవ్వనున్న బ్యాంక్ 20 లక్షల రూపాయల వరకు ఎక్స్ ప్రెస్ క్రెడిట్ లోన్స్ ను ఇవ్వనుంది. ఎస్బీఐ తీసుకున్న ఈ […]

Written By: Navya, Updated On : May 25, 2021 10:08 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్బీఐ యోనో యాప్ లో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫామ్ ద్వారా టూవీలర్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ రుణాలను ఇవ్వనుంది. రెండున్నర లక్షల రూపాయల వరకు టూవీలర్ రుణాలను ఇవ్వనున్న బ్యాంక్ 20 లక్షల రూపాయల వరకు ఎక్స్ ప్రెస్ క్రెడిట్ లోన్స్ ను ఇవ్వనుంది.

ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరుతోందని తెలుస్తోంది. కరోనా వల్ల ప్రజల్లో చాలామంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లకు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు. యోనో యాప్ లో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే క్షణాల్లో లోన్ పొందవచ్చు.

ఎస్బీఐ కస్టమర్లు యాప్ నుంచే ఏకంగా 10 లక్షల రూపాయల వరకు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లకు సైతం ప్రయోజనం చేకూరనుంది. కొత్త సర్వీసుల ద్వారా క్రెడిట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోవాలని ఎస్బీఐ భావిస్తుండటం గమనార్హం. ఎస్బీఐ కొత్త సర్వీసులను ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకురానుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్బీఐ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. దేశంలో మరే బ్యాంకుకు లేని స్థాయిలో ఎస్బీఐకు కస్టమర్లు ఉన్నారు.