https://oktelugu.com/

ఎస్బీఐ సూపర్ పాలసీ.. రూ.100తో రూ.2 కోట్లు ..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైఫ్ పూర్ణ సురక్ష పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఈ పాలసీని తీసుకుంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా పాలసీ కవరేజ్ లభిస్తుంది. Also Read: ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లకు షాకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 2, 2021 / 04:30 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైఫ్ పూర్ణ సురక్ష పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఈ పాలసీని తీసుకుంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా పాలసీ కవరేజ్ లభిస్తుంది.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

    ఎవరైతే ఎస్‌బీఐ లైఫ్ పూర్ణ సురక్ష పాలసీని తీసుకుంటారో వారు గడువు లోపు మరణిస్తే ఆ పాలసీ యొక్క ప్రయోజనాలను నామినీ పొందవచ్చు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండగా 20 లక్షల రూపాయల నుంచి రూ.2.5 కోట్ల రూపాయల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.

    నెల, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు. 30 సంవత్సరాల వ్యక్తి పదేళ్ల కాలపరిమితితో పాలసీని తీసుకుంటే సంవత్సరానికి రూ.35,849 వార్షిక ప్రీమియం చెల్లించాలి. రోజుకు కేవలం 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఏకంగా రూ.2.5 కోట్లు పాలసీని పొందవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

    తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తం పొందాలని అనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం.