https://oktelugu.com/

మొదటి రోజు అద్భుతం.. రేపు కలుద్దాం !

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా భారిన పడి త్వరగానే కోలుకున్నారు. అయితే తాజాగా వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌3’ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో సందడి చేయడానికి మళ్లీ సెట్స్‌ పైకి వచ్చాడు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా నిన్న సెట్ కి […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 09:51 AM IST
    Follow us on


    మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా భారిన పడి త్వరగానే కోలుకున్నారు. అయితే తాజాగా వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌3’ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో సందడి చేయడానికి మళ్లీ సెట్స్‌ పైకి వచ్చాడు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా నిన్న సెట్ కి వచ్చిన వరుణ్, సెట్స్‌ లో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

    Also Read: అరుదైన గౌరవం: ఆస్ట్రేలియా స్టాంప్ పై ఈ తెలుగు హీరో..

    ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి.. ‘వెల్‌ కమ్‌ టు సెట్స్‌ వరుణ్‌ బ్రో.. సినిమా సెట్‌లో మళ్లీ ఫన్‌ మొదలైంది’ అంటూ క్యాప్షన్‌ జోడించి ఒక పోస్ట్ పెట్టాడు. అయితే, ఇక ఇదే ట్వీట్‌ ను రీట్వీట్‌ చేసిన వరుణ్‌ తేజ్‌… ‘అనిల్‌ బ్రో… మొదటి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. రేపు కలుద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు. మొత్తనికి ‘ఎఫ్‌3’ సినిమా హడావుడి మొదలైపోయింది అన్నమాట. దిల్‌రాజు ఏకంగా రూ.80 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన ‘ఎఫ్‌2’ చిత్రానికి సీక్వెల్‌ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: పవన్ కళ్యాన్ అభిమానులకు గుడ్ న్యూస్

    మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో కాస్త కొత్తదనం చూపించి హిట్స్ అందుకున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి సక్సెస్ లతో సాగుతున్న హీరో. దాంతో ఈ మెగా హీరో కూడా ఎక్కువ పారితోషికం కోరుకుంటున్నాడని.. “ఎఫ్ 3” సినిమాకి వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇంతకీ వరుణ్ తేజ్ “ఎఫ్ 3” సినిమాకు వెంకటేష్ కంటే ఎక్కువ అడుగుతున్నాడట. రెమ్యూనరేషన్ ను తగ్గించుకోండి దిల్ రాజు అందర్నీ అడుగుతుంటే.. వరుణ్ తేజ్ మాత్రం దిల్ రాజునే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కామెడీగా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్