‘బండి’ మాట టీఆర్ఎస్ కు తూటాలా తగిలిందా..?

తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ బలపడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు పార్లమెంట్ గెలుచుకొని అన్ని పార్టీలకు షాకిచ్చిన సంగతి తెల్సిందే..! నాటి నుంచి బీజేపీ క్రమంగా రాష్ట్రంలో బలపడుతూ ముందుకెళుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే బలమైన సంకేతాలు ప్రజల్లోకి […]

Written By: Neelambaram, Updated On : January 3, 2021 10:18 pm
Follow us on

తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ బలపడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు పార్లమెంట్ గెలుచుకొని అన్ని పార్టీలకు షాకిచ్చిన సంగతి తెల్సిందే..!

నాటి నుంచి బీజేపీ క్రమంగా రాష్ట్రంలో బలపడుతూ ముందుకెళుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది.

దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పలు పార్టీల నేతలు కొద్దిరోజులుగా బీజేపీలో చేరుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది.

బీజేపీ కేంద్రం ఉండటాన్ని స్థానిక నేతలు చక్కగా వినియోగించుకున్నారు. అధిష్టానం సూచనలతో ప్రతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకులిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బండి సంజయ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఇంకా కలకలం రేపుతున్నాయి.

టీఆర్ఎస్ కు చెందిన 30మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బండి సంజయ్ కామెంట్ చేశారు. దీనిలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు సన్నిహితంగా ఉంటున్నారో తెలుసుకునేందుకు  నిఘా పెట్టినట్లు సమాచారం. పనిలోపనిగా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఏదిఏమైనా బండి సంజయ్ వ్యాఖ్యలు మాత్రం టీఆర్ఎస్ కు తూటాల తగిలాయనే కామెంట్లు విన్పిస్తున్నాయి.