ఇంట్లో చేసే వివిధ ఆహారపదార్థాల తయారీలో కొత్తిమీరను వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది కొత్తిమీరను కేవలం రుచి కోసం మాత్రమే వంటల్లో ఉపయోగిస్తామని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే పోషక విలువలు పుష్కలంగా ఉండే కొత్తిమీర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
Also Read: ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
కొత్తిమీర ఆకులు, కాడల్లో విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. కొత్తమీర పోషకాలు పూర్తిగా అందాలంటే కూరను వండిన తరువాత కొత్తమీరను వేయాలి. కొత్తిమీర ద్వారా శరీరానికి అవసరమైన ఎ, సి, కె విటమిన్లు లభిస్తాయి. కొత్తిమీర గుండె లయను క్రమబద్ధీకరించడం, రక్తపోటును నియంత్రించడం, జీవకణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: అల్పాహారంలో వీటిని తింటున్నారా.. ఆ వ్యాధులు వచ్చే ఛాన్స్…?
కొత్తిమీర ఆకులు శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. కొత్తిమీరలో ఉండే ఎసేన్షియాల్ ఆయిల్స్ మానసిక ఒత్తిడి, తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ రేటును పెంచడంలో, జీర్ణక్రియ వ్యాధులను తగ్గించడానికి కొత్తిమీర సహాయపడుతుంది. రోజూ కొత్తిమీర తీసుకుంటే కంటిచూపు మెరుగవుతుంది. కీళ్లనొప్పులతో బాధ పడేవాళ్లు కొత్తిమీర ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు పోషకాలు, ఐరన్ పుష్కలంగా ఉన్న కొత్తిమీరతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచి చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధ పడేవాళ్లు కొత్తిమీరతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది.