https://oktelugu.com/

హమ్మయ్య..! డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చారు

క్రమపద్ధతిలో ఇళ్ల నిర్మాణం, చక్కటి పాత్‌వేలు, రంగురంగుల విద్యుత్ దీపాలు.. ఎన్నో హంగులు.. మరెన్నో సదుపాయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తోంది. ప్రతీ పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర సర్కార్‌‌ ఈ నిర్ణయం తీసుకొని సొంతంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది. Also Read: రాజకీయాలు కేసీఆర్ బడ్జెట్‌ భారం తగ్గించుకుంటున్నారు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అధికారం చేపట్టగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా  ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 3:53 pm
    Follow us on

    Double Bed Room Distribution

    క్రమపద్ధతిలో ఇళ్ల నిర్మాణం, చక్కటి పాత్‌వేలు, రంగురంగుల విద్యుత్ దీపాలు.. ఎన్నో హంగులు.. మరెన్నో సదుపాయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తోంది. ప్రతీ పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర సర్కార్‌‌ ఈ నిర్ణయం తీసుకొని సొంతంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది.

    Also Read: రాజకీయాలు కేసీఆర్ బడ్జెట్‌ భారం తగ్గించుకుంటున్నారు

    కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అధికారం చేపట్టగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా  ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా ఇళ్ల పంపిణీ మొదలుపెట్టారు.

    హైదరాబాద్‌ మహానగరం శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ప్రజలు ఎదురుచూశారు. పండుగ పూట వారి కల నెరవేరినట్లైంది. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్తలాంటి వార్త చెప్పారు. కేసీఆర్ ప్రతిష్టాత్మక డబుల్‌ బెడ్‌రూం పథకం ఇళ్లకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు.

    Also Read: కేసీఆర్‌.. మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి..!

    ఆయా చోట్ల నిర్మించిన 1,152 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో 840, కట్టెలమండిలో 120, గోడే కా కబర్‌లో192 సిద్ధంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్హులైన పేదలకు మంత్రి అందించారు. ఇందుకు సంబంధించిన  ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షించారు.